
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహానికి తిప్పిరెడ్డి గంగాధర్ అనే యువకుడు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. గంగాధర్ చేపల వేట కోసం వెళ్ళి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. యువకుడిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే.. వరద ఉధృతి అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.