
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “ఓజీ” . అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా హీరోయిన్ పాత్రను అధికారికంగా పరిచయం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తోన్న విషయం ముందే బయటకు వచ్చినప్పటికీ, ఆమె పాత్రకు సంబంధించిన డీటెయిల్స్‌ను ఇప్పుడు రివీల్ చేశారు. ప్రియాంక ఈ సినిమాలో “కన్మణి” అనే ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది