
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారీ కావడం సంచలనం సృష్టించింది. పలు దొంగతనాల కేసులో జైలులో ఉన్న దువ్వూరు మండలం జిల్లెలకు చెందిన అంతరాష్ట్ర దొంగ మహ్మద్ రఫీ ఒక చోరీ కేసులో ఈనెల 13న అరెస్టు చేసిన రాజుపాలెం పోలీసులు నిందితుడిని ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించగా ఇవాళ ఉదయం సబ్ జైలు నుంచి గోడ దూకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విచారణ ప్రారంభించి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.