
నాగాలాండ్ గవర్నర్ గణేశన్(80) కన్నుమూశారు. ఈ నెల 8న తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా, ఫలితం లేకపోయింది. ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గణేశన్ ఒక నిష్ఠమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా వంటి పలు కీలక పదవులను నిర్వర్తించారు.