
అందాల కాశ్మీరం.. కన్నీటి సంద్రమైంది. కిష్వార్‌లోని చండీ మాతా మచైల్ యాత్రకు వెళ్లిన భక్తులు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా కురిసిన కుండపోతతో.. అక్కడి కొండల నుంచి పెద్ద పెద్ద బండరాలు.. భక్తులు బసచేస్తున్న గుడారాలు, క్యాంపులపై పడ్డాయి. కొండలపై నుంచి వరద తన్నుకొచ్చింది వందల మంది కొట్టుకుపోయారు. బండరాళ్లు మీదపడి చాలామంది చిక్కుకుపోయారు. బయటకు తీస్తుంటే శవాలు బయటపడుతున్నాయి కాని.. ఎవరూ సజీవంగా రావడంలేదు. శిథిలాల కింద 500మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.