
గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. Israel భద్రతా దళాలు దక్షిణ గాజాలో వైమానిక దాడి జరిపాయి. ఖాన్ యూనిస్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో హమాస్‌కు చెందిన సీనియర్ నేత నాసెర్ మౌస్సా హతమయ్యాడు.
దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకారం, నాసెర్ మౌస్సా హమాస్ రఫా బ్రిగేడ్‌కు అత్యంత కీలకమైన నేత. అతను ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు.
పైగా, ఇజ్రాయెల్‌పై దాడుల కోసం వ్యూహాలు రూపొందించే వ్యవహారంలో ముందుండేవాడు.