
ెలంగాణలో మర్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారం.. హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. మీరు మర్యాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… తాము హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తామన్నారు. ఈ ఉద్యమం కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివంటూ ఫైర్ అయ్యారు. మార్వాడీలు హిందూ మతానికి అనుకూలంగా ఉంటున్నారనే కారణంతో.. ఒక పద్దతి ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.