నిజామాబాద్ జిల్లా సింగంపల్లి గ్రామానికి చెందిన మమతకు చెందిన బర్రె సవిత ఇంటి ఎదుట దుర్గంధంగా మారుస్తుంది. పేడ, మాలమూత్ర విసర్జననలతో విసిగిపోయిన సవిత.. ఆ పశువు యజమాని సభ్యులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని బర్రెను గదిలో బంధించింది. దీంతో కోపోద్రిక్తులైన మమత కుటుంబ సభ్యులు తమ పశువుకు మంత్రాలు చేసిందని ఆరోపిస్తూ సవితను హనుమాన్ ఆలయం వద్ద చెట్టుకు కట్టేసి చితకబాదారు. గ్రామస్తుల సమక్షంలో మహిళపై దాడి చేశారు తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. .

