విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న బుడమేరు నది ప్రవాహం ప్రమాదకరంగా మారిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ కేశినేని చిన్ని,ఎమ్మెల్యే బొండా ఉమా సూచించారు. బుడమేరు ప్రవాహం వల్ల తలెత్తే ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, దీని కోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని వెల్లడించారు.

