పట్టణ ప్రాంతాల్లోని కొత్త కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను ICICI బ్యాంక్ పాక్షికంగా రూ.50,000 నుండి రూ.15,000కి తగ్గించింది. వినియోగదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావడంతో ఎట్టకేలకు కొన్ని రోజుల్లోనే వెనక్కి తగ్గింది. ఇప్పటికీ మునుపటి దానికంటే రూ. 5,000 ఎక్కువ. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని కొత్త ఐసిఐసిఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్‌ను కూడా రూ.25,000 నుండి రూ.7,500కి తగ్గించారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో పాత కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ నియమాన్ని రూ.5,000 వద్దే ఉంచింది.
.

