
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి, రీపోలింగ్ జరిపించాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని.. ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనంలో ఉన్నారని విమర్శించారు. రెండు పోలింగ్ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ధైర్యంగా ఓటేశారని తెలిపారు.