
రాష్ట్రంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు లబ్దిచేకూర్చేందుకే బలవంతపు భూ సేకరణ చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర పూర్వ. ప్రస్తుత సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. 2013 భూ సేకరణ, పునరావాసం చట్ట ప్రకారం పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం రైతులు, పేదల ఆమోదంతోనే భూ సేకరణ చేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణ చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. అమరావతి రాజధాని పేరుతో లక్షలాది ఎకరాలు భూములు సేకరించారని భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు.