
దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరిగ్గానే ఉందని.. పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ చెబుతోంది. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా నిర్వహిస్తే అది దేశవ్యాప్తంగా జరగాలి.