ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెల రోజుల లోపే, సోమవారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో తన రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది.

