
బాద్షా ఈవెంట్ తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. 25 ఏళ్ల క్రితం సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉంది. కానీ మొట్ట మొదటి సారి మూజీబ్ అనే అభిమాని.. ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం.దయచేసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దాం. మళ్లీ సక్సెస్ మీట్ కు కలుద్దాం” అని అన్నారు ఎన్టీఆర్.