హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం సీఎం ఏ. రేవంత్ రెడ్డి వరద ప్రభావిత బాల్కంపేట ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఉన్నారు. బుద్ధా నగర్, అమీర్పేట్, మైత్రి వనం ప్రాంతాల్లో ప్రజలను కూడా కలిసిన సీఎం.. డ్రెయినేజ్ వ్యవస్థను తక్షణం సరిచేయాలని ఆదేశించారు. ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

