
బెంగళూరు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా మూడు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బెంగళూరు-బెళగావి, అమృత్సర్-శ్రీమాతా వైష్ణో దేవి కత్రా, మరియు నాగ్‌పూర్ (అజ్నీ)-పుణే మార్గాల్లో ప్రయాణిస్తాయి. 19.15 కిలోమీటర్ల పొడవైన ‘ఎల్లో లైన్’ (రాగిగుడ్డ-బొమ్మసంద్ర) మెట్రో మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఈ మార్గం ఎలక్ట్రానిక్ సిటీ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది. ప్రధాని ఈ మార్గంలో ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించారు.