
ఎప్పుడూ స్టేటస్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు పెట్టే వారికి వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇకపై ఫోటోలు ఎడిట్ చేయడానికి లేదా థర్డ్ పార్టీ యాప్స్ తో అవసరం లేకుండా చేసింది.
యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, స్టేటస్ అప్డేట్ చేయడం మరింత ఈజీగా మారింది. అంటే పుట్టినరోజు పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ట్రిప్ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ ఒకే స్టేటస్‌లో చూపించుకోవచ్చు.