
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రక్షాబంధన్ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గంలోని 1,500 మంది వితంతు మహిళలకు పవన్ కల్యాణ్ రాఖీ కానుక పంపారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసైనికుల ద్వారా ఈ కానుకలను పంపించారు. పిఠాపురం శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా పవన్ కల్యాణ్ ఈ కానుకలు పంపినట్టుగా తెలిపారు.