
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా రెడీ అయింది. రాష్ట్రంలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. న్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం రోజున హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డితో గురుదీప్ సింగ్ నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది.