
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, గిరి పుత్రుల్లో మరింత చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. వంజంగిలో వనదేవత మోదకొండమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలో కాఫీ తోటలను పరిశీలించి, గిరిజన సంప్రదాయ వేడుకలను తిలకించారు.