
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అరకు కాఫీ కియోస్క్ ను మెప్మా ద్వారా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇక గిరిజన సహకార కార్పోరేషన్ ఉత్పత్తులను అమెరికా లాంటి దేశాల్లో విక్రయించేందుకుగానూ హాతీ సర్వీసెస్ ఎల్ఎల్ సీ కంపెనీతోనూ జీసీసీ ఒప్పందం చేసుకుంది. షోరూముల వద్ద అరకు కాఫీ కియోస్క్ లను ఏర్పాటు చేయాలని కూడా ఒప్పందంలో అవగాహన కుదిరింది. ప్రముఖ కార్పోరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్స్ సంస్థ కూడా ఆర్గానిక్ అరకు కాఫీని బ్రాండ్ చేసేందుకు, మార్కెట్ చేసేందుకు జీసీసీతో ఒప్పందం చేసుకుంది.