
ముగ్గురు యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు చేస్తున్నారు. సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్ విసురుతున్నారు. HelpingAI సులభమైన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది. అదే కాస్త క్లిష్టమైన సమస్యలకు ఆలోచించి సమాధానం ఇస్తుంది… మరీ క్లిష్టమైన ప్రశ్నలకు బాగా లోతుగా ఆలోచించి, అవసరమైతే రెండోసారి సమీక్షించి జవాబు ఇస్తుంది. ఇది చైనీస్ ఏఐ మోడల్ DeepSeek-R1 కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తోందని… OpenAI ChatGPT-4 కంటే సమర్ధవంతంగా పనిచేస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.