
హైటెక్ సిటీ సమీపంలోని భరత్‌నగర్ – ఖైతలాపూర్ మార్గంలో ఉన్న వరద కాలువను ఆక్రమించిన వాసవి కన్స్ట్రక్షన్స్ సంస్థపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ముల్లకత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలిపే వరద కాలువలో నిర్మాణ సంస్థ మట్టి పోసినట్లు విచారణలో తేలింది.
నిర్మాణ సంస్థపై కేసు పెట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.