
ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీపోస్ట్ అనే ఫీచర్ సహాయంతో యూజర్స్ వారికి నచ్చిన పోస్ట్ , రీల్‌ను రీపోస్ట్ చేయవచ్చు. ఇది వారి ఫాలోవ్స్ ఫీడ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ పెంచేందుకు, ఫ్రెండ్స్ ఫీడ్‌లో కంటెంట్ డిస్కవరీ ఫీచర్‌ను మెరగుపర్చేందకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మరో 2 ఫీచర్లను ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇన్స్టాగ్రామ్ మ్యాప్(Instagram Map), రీల్స్‌లో ఫ్రెండ్స్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.