బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతాం’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో చర్చించి వెంటనే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మా డిమాండ్‌ను ఆమోదిస్తారా, లేక రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి సాధించుకోవాలా?’ అని మోదీకి సవాల్ విసిరారు.

