కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు అశోక్‌నగర్‌లోని గూడెం కొట్టాల వాసులకు నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. 40 ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2025 జనవరిలో టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30 ద్వారా ఎకరా స్థలాన్ని 150 మంది పేదలకు ఇళ్లపట్టాల కింద పంపిణీ చేశారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా బుధవారం శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది.

