ఓ సభలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. మహిళలు ఇపుడు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కలిగిందని “భర్తలు విసుక్కుంటే.. కసురుకుంటే ఎవరూ పడొద్దు.. హ్యాపీగా బస్సు ఎక్కి ఫ్రీ గా పుట్టింటికి వెళ్లిపోండి.. వాళ్లే చార్జీలు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని ఏంఎల్ఏ అనటంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆర్టీసి బస్సులను భార్యా, భర్తలు విడిపోవటానికి ఉపయోగిస్తారా అంటూ విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

