మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంకు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం కు.. చిరంజీవి ప్రత్యేకంగా బొకె ఇచ్చి విష్ చేశారు. సీఎం రేవంత్ కూడా.. చిరంజీవిని అంతే ఆప్యాయతతో పలకరించి.. బొకెతో పాటు, శాలువతో చిరును సన్మానించారు. ఇద్దరు కూడా చాలా సేపు పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తొంది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ.. తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ ప్లాట్‌ఫారమ్‌లో పోస్టు చేసింది.

