యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో లారీ బీభత్సవ సృష్టించింది. పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి దుకాణాల మీదికి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు బైకులు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు. మృతుల్లో ఒకరిని రాజపేట మండలం కురారం గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.

