
164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటనల సమయంలో జనం వచ్చిన విజువల్స్ చూపించాల్సిన అవసరం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
జనం రాకపోతే అసలు లాఠీచార్జ్ ఎందుకు చేశారో హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మా తోకలు కట్ చేయడం కాదు.. మా తోకలు జనం కట్ చేశారు.. మీ తోకలు కట్ చేయకుండా చూసుకోండి అని సెటైర్లు వేసారు.