
భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మక 71వ ‘నేషనల్ ఫిలిం అవార్డ్స్’ 2023వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం’గా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా ఎంపికైంది. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో ‘హనుమాన్’ చిత్రాన్ని ఎంపిక చేయగా.. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ‘బేబీ’ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్, బెస్ట్ మేల్ సింగర్ అవార్డు పీవీఎన్ఎస్ రోహిత్ అవార్డులను సొంతం చేసుకున్నారు.