
సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడమే కాకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు సీఎం వివిధ సమావేశాలు, రౌండ్‌టేబుల్ చర్చల్లో పాల్గొని పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. సీఎం సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్‌తో సమావేశమయ్యారు.