
ఓ నకిలీ సర్టిఫికెట్ ముఠా కుకట్పల్లిలో దుకాణం తెరిచింది. శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యకలాపాలకు తెరలేపారు. వీరు యువతీయువకుల డబ్బులు కాజేస్తూ నకిలీ సర్టిఫికేట్స్ అంజేస్తున్నారు. శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ, విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల పట్టాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇప్పటివరకు కనీసం 46 మందికి నకిలీ సర్టిఫేక్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
వీరిలో 24 మంది ఇప్పటికే ఆ పత్రాలతో విదేశాలకు వెళ్లిపోయినట్లు కూడా విచారణలో వెల్లడైంది.