
సాధ్వీ ప్రేమ్ బైసా అనే రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవత్ కథా వక్త మరో అథ్యాత్మిక వేత్త వీరంపురి మహారాజ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు. వీడియో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. సాధ్వీ ప్రేమ్ బైసా ఈ వీడియో పాతదని, మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి తనను అపఖ్యాతి పాలు చేసేందుకు ఉపయోగించారని ఆరోపించారు. వీడియోను బహిరంగం చేయకుండా ఉండేందుకు 20 లక్షలు డిమాండ్ చేసి తనను బ్లాక్మెయిల్ చేశారని ప్రేమ్ బైసా ఆరోపించారు.