ములుగు జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కరుస్తున్న వర్షాలతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే పర్యాటకుల సందర్శనను నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి నోటీసులు వచ్చేవరకు బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులను అనుమతించబోమని తెలిపారు. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

