భర్తను చంపి ఏకంగా డోర్ డెలివరీ చేసింది ఓ భార్య. నంద్యాల జిల్లాకి చెందిన రమణ పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. నచ్చజెప్పేందుకు తనే వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఘర్షణ పెద్దది కావడంతో రమణమ్మ ,ఆమె సోదరుడు దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. రమణయ్య మృతదేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చి అతడి ఇంటి దగ్గరే పడేసి వెళ్లిపోయారు.

