కర్ణాటక రాష్ట్రంలో జీఎస్‌టీ నోటీసులకు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు ఈ నిర్ణయం టీ, కాఫీల విక్రయాలను నిలిపివేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. నిరసనలో భాగంగా స్థానికంగా ఉన్న కేఫ్, బేకరీలతో కేవలం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీని మాత్రమే విక్రయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చిరు వ్యాపారులు తమ దుకాణాల్లో యూపీఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు.ఓన్లీ క్యాష్ ఇస్తేనే వ్యాపారలావాదేవీలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తామని చిరువ్యాపారులు హెచ్చరించారు.

