
దేశ రాజధాని ఢిల్లీలో మరో విమాన ప్రమాదం ప్రయాణికుల్ని బెంబెలెత్తేలా చేసింది. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం AI 315 ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU)లో మంటలు వ్యాపించాయి. అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలకు విమానం బాగా కాలిపోయింది. భారీగా నష్టంవాటిల్లింది. మరోవైపు.. ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.