
కడప జిల్లా జైలులో ఎర్రచంద్రనం స్మగ్లర్లకు సెల్ఫోన్ల అందజేసిన కేసులో ఐదుగురు జైలు అధికారులు, సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. సెల్ఫోన్ల ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో డీఐజీ రవికిరణ్ కడపై జైల్లో నాలుగురోజుల పాటు విచారణ జరిపి ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ నివేదిక ప్రకారం జైలర్ అప్పారావు, డిప్యూటీ సూరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను సస్పెన్షన్ చేస్తూ జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.