ఆ తర్వాత ఒక్క ఫ్లాప్ మూవీతో తాను స్ట్రక్ అయిపోయాను, ఏం చేయాలనే డైలామాలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ నా జీవితంలోకి వచ్చాడు. నాకు `జల్సా` సినిమాని ఇచ్చాడు. ఎవరూ తనతో సినిమా చేయడానికి ముందుకు రాకపోయినప్పుడు త్రివిక్రమ్ వచ్చి నాతో సినిమా చేసి హిట్ ఇచ్చాడు. సక్సెస్ లో ఉన్నప్పుడు మన వెంట ఉండేవారుకాదు, పరాజయంలో, కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట నిలబడేవాడే నిజమైన ఫ్రెండ్. అలా నాకు దొరికిన గొప్ప స్నేహితుడు త్రివిక్రమ్ అని తెలిపారు పవన్ కళ్యాణ్.

