బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. బీహార్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

