ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్. రాజకీయ కుట్రతోనే ప్రజల పక్షాన నిలబడే వారి నోరు మూయించడానికి చేసిన అక్రమ అరెస్ట్‌గా భావిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం తమ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకారచర్యగా చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా మిథున్ రెడ్డికి తన మద్దతు తెలిపారు వైఎస్ జగన్

