తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బౌలర్లు చెలరేగగా ప్రధాన ప్లేయర్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మంధాన ఔటయ్యాక దీప్తి శర్మ (30), అరుంధతి రెడ్డి(14)లు పోరాడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

