
‘గతంలో పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నానని చెప్పారు. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనిచ్చి మమ్మల్ని బ్రతకనివ్వండి’అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు తరలించే రాయలసీమకు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మీ ఉదారతను ప్రదర్శించండి.’అని విజ్ఞప్తి చేశారు.మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.