విప్రో లిమిటెడ్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.మాజీ ఉద్యోగి అభిజిత్ మిశ్రాకు ఇచ్చిన టెర్మినేషన్ లెటర్ లో పరువు తీసేలా వాక్యాలు ఉన్నాయని అందుకు గాను రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ లేఖలో “మాలిషియస్ కండక్ట్” (దురుద్దేశపూరిత ప్రవర్తన) , “కంప్లీట్ లాస్ ఆఫ్ ట్రస్ట్” (పూర్తి విశ్వాసం కోల్పోవడం ) వంటి పదాలు ఉన్నాయి. ఇవి మిశ్రా వృత్తిపరమైన గౌరవాన్ని , భవిష్యత్ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కోర్టు భావించింది.

