
ముసుగు వీడింది, నిజం తేటలతెల్లమయ్యింది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు. బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి..గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.