
నిర్మల్ జిల్లాలోని న్యూ కంజర గ్రామంలో రైతులకు సుమారు 33 ఏళ్ల క్రితం అనగా 1982 సంవత్సరంలో.. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం దాదాపు 1000 ఎకరాల భూమి కేటాయించింది. అధికారులు డీ వన్ పట్టాలతో సేత్వార్లు జారీ చేసి సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ కారణంగా సుమారు 1000 ఎకరాల భూమి అసైన్డ్ జాబితాలో చేరింది. దీంతో 312 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొనుగోళ్లు, అమ్మకాలు జరగడం లేదు.