
హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన సరస్వతీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదలాయింపు పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, ఎన్సీఎల్టీ తుది తీర్పును రిజర్వ్ చేసింది. జగన్ తరపు న్యాయవాది వాదనలో, తన అనుమతి లేకుండా కుటుంబ సభ్యులు సంస్థలో తన వాటాను బదలాయించారని పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాదులు మాత్రం బదలాయింపు చట్టబద్ధంగానే జరిగిందని, ముందస్తు ఒప్పందం ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.