ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత విపణిలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఉదయం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ఈ ఈవెంట్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలిషోరూం కోసం టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చింది.

